‘మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి’
విద్యార్థులు గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని సింగరేణి ఎక్సైజ్ సీఐ పి. లింగ గౌడ్ అన్నారు. సింగరేణి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం మాదక ద్రవ్యాల వినియోగం వల్ల...
– ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదువుకోవాలి
– ఎక్సైజ్ సీఐ పి.లింగ గౌడ్
కారేపల్లి, అక్టోబర్ 31 : విద్యార్థులు గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని సింగరేణి ఎక్సైజ్ సీఐ పి. లింగ గౌడ్ అన్నారు. సింగరేణి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకోవాలని తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కోసం కాకుండా తమ భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునేందుకు ఇష్టంతో చదువుకోవాలని హితవు పలికారు. మంచి విద్య, క్రమశిక్షణ, సత్ప్రవర్తనతోనే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చన్నారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ విజయకుమారి, అధ్యాపకులు, ప్రజా యువజన సంఘం అధ్యక్షుడు, మెడికల్ ఆఫీసర్ బి.సురేశ్, ఎక్సైజ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

‘మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి’
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి’
ENE Repeat | ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ట్రైలర్ అప్డేట్.. వచ్చేస్తోన్న మ్యాడ్ గ్యాంగ్!
‘ఓయూ, కేయూ వర్సిటీల పూర్వ విద్యార్థుల జాతీయ భావజాల సమ్మేళనానికి ఆహ్వానం’
Nikeelu Gunda | సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ నికీలు గుండాకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
100 Feets Master Plan Road | మేం కష్టపడి కట్టుకున్న స్కూల్ పోతుంది.. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై బాధిత మహిళ
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

