Nikeelu Gunda | సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ నికీలు గుండాకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
Nikeelu Gunda | హైదరాబాద్కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎడ్యుకేటర్, సూపర్ ఏఐ అకాడమీ వ్యవస్థాపకుడు నికీలు గుండాకు 'ఏఐ ఎడ్యుకేటర్ అండ్ ఇన్నోవేటర్ ఆఫ్ ది ఇయర్' పురస్కారం దక్కింది. ప్రగతి రత్న అవార్డ్స్ 2026లో ప్రముఖ నటి శ్రియా శరణ్ చేతుల మీదుగా ఆయన ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు.
Nikeelu Gunda : హైదరాబాద్కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎడ్యుకేటర్, సూపర్ ఏఐ అకాడమీ వ్యవస్థాపకుడు నికీలు గుండాకు ‘ఏఐ ఎడ్యుకేటర్ అండ్ ఇన్నోవేటర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం దక్కింది. ప్రగతి రత్న అవార్డ్స్ 2026లో ప్రముఖ నటి శ్రియా శరణ్ చేతుల మీదుగా ఆయన ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. అక్టోబర్ 25న హైదరాబాద్ బండ్లగూడలోని పీబీఆర్ కన్వెన్షన్ హాల్లో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.
ఈ కార్యక్రమానికి సూపర్ ఏఐ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ స్వాతి కిరణ్ కూడా హాజరయ్యారు. బిజినెస్ గ్రోత్ స్ట్రాటజిస్ట్, మోటివేషనల్ స్పీకర్ నేతృత్వంలో యూనిక్ లైఫ్ గ్రూప్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో.. విద్య, వ్యవస్థాపకత, సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ, వినోదం, సామాజికాభివృద్ధి రంగాల్లో సేవలందించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఇతర ప్రాంతాలకు చెందిన 81 మందిని విజేతలుగా గుర్తించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషన్, డిజిటల్ లిటరసీ, సాంకేతికత ఆధారిత నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి అకాడమీ చేస్తున్న నిరంతర ప్రయత్నాలకు గుర్తింపు తీసుకురావడానికి ఈ కార్యక్రమం ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ప్రాక్టికల్ శిక్షణా కార్యక్రమాలు, డిజిటల్ లెర్నింగ్ కార్యక్రమాల ద్వారా విద్యార్థులు, ఉద్యోగ నిపుణులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తల, సాంకేతికేతర నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యను అందుబాటులోకి తీసుకురావడంలో నికేలు గుండా చేసిన కృషికిగాను ఈ అవార్డు దక్కింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

