‘ఓయూ, కేయూ వర్సిటీల పూర్వ విద్యార్థుల జాతీయ భావజాల సమ్మేళనానికి ఆహ్వానం’
ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయాలకు చెందిన పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో నవంబర్ 3న సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ నాగోల్‌లోని శుభం కన్వెన్షన్‌లో “A Confluence of Nationalists – 2026” పేరిట ప్రత్యేక సమ్మేళనం నిర్వహించబడుతోందని...
– కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీ చరణ్
నల్లగొండ, అక్టోబర్ 31 : ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయాలకు చెందిన పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో నవంబర్ 3న సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ నాగోల్‌లోని శుభం కన్వెన్షన్‌లో “A Confluence of Nationalists – 2026” పేరిట ప్రత్యేక సమ్మేళనం నిర్వహించబడుతోందని కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీ శచరణ్ తెలిపారు. సమ్మేళనానికి అందరూ హాజరు కావాల్సిందిగా ఆయన కోరారు. జాతీయ భావజాలం, దేశభక్తి, సామాజిక బాధ్యత, యువతలో నాయకత్వ లక్షణాలు, దేశ నిర్మాణంలో విద్యావంతుల పాత్రను ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. బీజేపీ తెలంగాణ ఉపాధ్యక్షుడు, కర్ణాటక రాష్ట్ర బీజేపీ సహ ఇన్చార్జిగా జాతీయ స్థాయిలో నూతన బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కాసం వెంకటేశ్వర్లును కార్యక్రమంలో ఘనంగా సత్కరించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి, ఏబీవీపీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ విచ్చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు, యువత, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, జాతీయ భావజాలాన్ని విశ్వసించే పెద్దలు, మేధావులు అందరూ ఈ సమ్మేళనంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీచరణ్ విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | మా ముందుకొచ్చి మాట్లాడే దమ్ముందా?.. కాంగ్రెస్ నేతలకు రైతు సవాల్
Malasiya | భారతీయులకు మలేషియా షాక్.. వీసా ఫ్రీ ఎంట్రీ నిలిపివేత
Aadhar Card | ‘పుట్టిన తేదీకి ఆధార్ కార్డ్ ధ్రువపత్రం కాదు’
PF Withdraw | ఇకపై నెలనెలా పీఎఫ్ విత్‌డ్రా.. సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌కు ఈపీఎఫ్‌వో ఆమోదం
Shah Rukh Khan | షారుఖ్ఖాన్అరుదైన ఘనత.. ది 100 గ్రేటెస్ట్ మూవీ స్టార్స్ ఆఫ్ ఆల్‌టైమ్ జాబితాలో చోటు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

