Job Mela | బేగంపేట : నగరానికి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఈ నెల 14న కళాశాల ప్రాంగణంలో ‘జోబోథాన్-2025’ పేరుతో మెగా జాబ్‌మేళాలను నిర్వహించనున్నది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్ ఆవిష్కరించారు. ఈ మేళాలో సుమారు 25 ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలు పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ ఉద్యోగ మేళాలో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువత ఆతిథ్యరంగ విద్యార్థులు, నిపుణులు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని చెప్పారు.
వివరాలకు 9440409988 నంబర్లో సంప్రదించాలని కోరారు. లేదంటే ihmshrishakti.com వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ జాబ్ ఫెయిర్‌లో ప్రముఖ ఆతిథ్యరంగ సంస్థలైన తాజ్ గ్రూప్, ఐటీసీ వెల్కమ్, హయత్, మారియట్, రాడిసన్ తదితర సంస్థలు పాల్గొంటాయని తెలిపారు. ఆతిథ్యరంగంలో ప్రపంచవ్యాప్తంగా మరిన్ని అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రముఖ విదేశీ కన్సల్టెన్సీ సంస్థలైన కెరీర్ క్రాఫ్టర్, ఏఎస్పీడీ, ట్రివల్ చాప్టర్ సంస్థలు స్కిల్ ఇమిగ్రేషన్, జే1 వీసా, ఇంటర్నేషనల్ ట్రైనింగ్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని నిర్వాహకులు తెలిపారు.