జవహర్‌నగర్, మార్చి 4: కౌకూర్ భరత్‌నగర్‌లో జరిగిన సైఫ్అలీఖాన్ హత్య కేసును జవహర్‌నగర్ పోలీసులు 24గంటల్లోపు ఛేదించారు. మల్కాజిగిరి డీసీపీ జానకి శనివారం మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. సైఫ్అలీఖాన్(25), వాలి శ్రవణ్‌కుమార్, దొబ్బల విక్రమ్ రాజీవ్ గృహకల్ప భరత్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు.
బూరుగుపల్లి విఘ్నేశ్ వీరందరూ స్నేహితులు. ఈ నెల 2న రాత్రి 10:30 సమయంలో శ్రవణ్, విఘ్నేశ్‌లు అదే కాలనీలోని కిరాణ దుకాణం వద్ద సిగరెట్ తాగుతున్నారు. అదే సమయంలో సైఫ్ కొందరితో గొడవపడుతున్నాడు. అక్కడికి చేరుకున్న శ్రవణ్ సైఫ్‌ను కొట్టి గొడవ సద్దుమనిపించారు. అక్కడి నుంచి ముగ్గురు విక్రమ్ ఇంటికి వచ్చారు. కాలనీవాసుల సమక్షంలో కొట్టి అవమానించారని సైఫ్ అలీఖాన్ శ్రవణ్‌తో గొడవపడ్డాడు. దీంతో ముగ్గురు స్నేహితులు కలిసి సైఫ్ అలీఖాన్‌ను విచక్షణారహితంగా కర్రలతో కొట్టారు.
అనంతరం కాలనీలోని విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో ఉన్న బహిరంగ ప్రదేశానికి తీసుకొచ్చి సైఫ్ కాళ్లపై పెట్రోల్‌పోసి నిప్పంటించారు. మృతి చెందాడని నిర్ధారణకు వచ్చిన తరువాత ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు.మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జవహర్‌నగర్ పోలీసులు ముగ్గురు నిందితులను పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. పోలీసులను రాచకొండ సీపీ డీఎస్ చౌహన్ అభినందించారు. సమావేశంలో ఎస్వోటీ డీసీపీ గిరిధర్ ఐపీఎస్, కుషాయిగూడ ఏసీపీ వెంకట్‌రెడ్డి, జవహర్‌నగర్ ఎస్‌హెచ్‌వో సీతారాం, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మధుకుమార్ పాల్గొన్నారు.