బొల్లారం, జూన్ 4 : కంటోన్మెంట్లో నెలకొన్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కృషి చేస్తానని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి అన్నారు. న్యూ బోయిన్పల్లిలో నూతన పంప్ హౌస్ నిర్మాణ పనులను స్థానికులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీటి ఎద్దడి నివారణకు కంటోన్మెంట్ బోర్డు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరితగతిన పనులు పూర్తి చేసి నీటి సరఫరా అందించాలని కంటోన్మెంట్ బోర్డ్ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు.