 
                                                            యావత్ దేశ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పురుడు పోసుకున్న బీఆర్ఎస్ పార్టీకి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేషమైన మద్దతులభిస్తున్నది. కార్పొరేట్ శక్తుల కొమ్ముకాస్తూ సామాన్యుల జీవితాలను చిన్నభిన్నం చేస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్నిగద్దె దింపేందుకు సీఎం కేసీఆర్ సమరశంఖం పూరించారు. ఇందుకు ఖమ్మం జిల్లా వేదికగా తలపెట్టిన బహిరంగ సభకురాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలి వెళ్లారు. బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నగరంలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లి సభను విజయవంతం చేశారు.
 
                            