దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం గ్రేటర్‌లోని పలు చోట్ల రైతు దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. తొమ్మిదేండ్లలో తెలంగాణ వ్యవసాయ రంగంలో ఎంత గణనీయమైన పురోగతి సాధించిందో వివరించారు. పలువురు రైతులను సన్మానించారు. ‘రైతుల కష్ట, సుఖాలు తెలిసిన కేసీఆర్ సీఎంగా ఉన్నందు వల్లే తెలంగాణలో రైతు సంక్షేమ రాజ్యం కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలతోనే తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా మారింది’.
అని చెప్పారు. దుబ్బచెర్ల క్లస్టర్, రాచులూరులో జరిగిన వేడుకల్లో మంత్రి సబితాఇంద్రారెడ్డి, మలక్‌పేట మహబూబ్ మ్యాన్షన్‌లోని మార్కెట్లో హోం మంత్రి మహమూద్ అలీ, బోయిన్పల్లి మార్కెట్ యార్డులో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మూడుచింతలపల్లి, కీసర, అలియాబాద్, రాయిలాపూర్‌లో మంత్రి మల్లారెడ్డి, రాజేంద్రనగర్, మల్కారంలో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, బౌరంపేట్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం భవనంలో ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, ఎమ్మెల్యే వివేకానంద్, ఎల్బీనగర్ కూరగాయల మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా పాల్గొన్నారు.
మేడ్చల్, జూన్3 (నమస్తే తెలంగాణ) :ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలతో తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా మారిందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం మూడుచింతలపల్లి, కీసర, అలియాబాద్, రాయిలాపూర్‌లో జరిగిన రైతు దినోత్సవాల్లో మంత్రి మల్లారెడ్డి, కలెక్టర్ అమోయ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలు రైతులకు చేసిందేమీ లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసాడని అన్నారు. సకాలంలో రైతులకు విత్తనాలు, ఎరువులు అందిస్తున్నామని, పండిన ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. వ్యవసాయరంగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌వన్ స్థానానికి ఎదుగుతుందని అన్నారు.
Hyd9
రైతులకు అండగా ప్రభుత్వం
రైతులకు అండగా ప్రభుత్వం ఉంటుందని కలెక్టర్ అమోయ్‌కుమార్ అన్నారు. అన్ని రకాల పంటలు సాగు చేసేందుకు వ్యవసాయాధికారుల సలహాలు సూచనులు తీసుకునేలా రైతువేదికలను ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతుబంధు అధ్యక్షుడు నందారెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, ఆర్డీవో రవి, జిల్లా వ్యవసాయాధికారిణి మేరీ రేఖ,మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
– కలెక్టర్ అమోయ్‌కుమార్
రైతుల పండుగ
దశాబ్ది వేడుకల్లో భాగంగా రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని పండుగ వాతావరణంలో ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీలు నిర్వహించారు. రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చి ర్యాలీలలో పాల్గొన్నారు. బోనాలు, లంబాడీ నృత్యాల నడుమ మంత్రి మల్లారెడ్డి నాగలి భుజన వేసుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. రైతు దినోత్సవానికి హాజరైన రైతులతో మంత్రి మల్లారెడ్డి, కలెక్టర్ అమోయ్‌కుమార్ సహపంక్తి భోజనాలు చేశారు.