IT Raids : హైదరాబాద్లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపాయి. వసుధ ఫార్మా కెమికల్స్ లిమిటెడ్లో ఇవాళ ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వసుధ గ్రూప్స్ సీఈవో, డైరెక్టర్లు, మేనేజింగ్ డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఐటీ అధికారులు 30కి పైగా బృందాలుగా విడిపోయారు. ఎస్ఆర్నగర్లోని ప్రధాన కార్యాలయంతో పాటు మాదాపూర్, జీడిమెట్లలోని కంపెనీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.