ఈగల్ ఆపరేషన్.. గంజాయి డాన్ పరార్
కరుడుగట్టిన గంజాయి డాన్ నీతుబాయ్ ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోవడంతో మత్తు లేడీని పట్టుకునేందుకు ఈగల్ టీమ్ బుధవారం నానక్‌రామ్‌గూడలో వాలింది. నీతును పట్టుకునేందుకు భారీ ఆపరేషన్ నిర్వహించింది. కానీ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న గంజాయి డాన్ తన ఇంటి నుంచి పరారైంది.
హైదరాబాద్, జూన్ 11(నమస్తేతెలంగాణ): కరుడుగట్టిన గంజాయి డాన్ నీతుబాయ్ ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోవడంతో మత్తు లేడీని పట్టుకునేందుకు ఈగల్ టీమ్ బుధవారం నానక్‌రామ్‌గూడలో వాలింది. నీతును పట్టుకునేందుకు భారీ ఆపరేషన్ నిర్వహించింది. కానీ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న గంజాయి డాన్ తన ఇంటి నుంచి పరారైంది. అయితే ఈగల్ ఫోర్స్ దాడులు జరిపే సమయానికి నిందితురాలి ఇంటి వద్ద గంజాయి కోసం మొత్తం 47మంది వినియోగదారులు క్యూ కట్టి ఉండడం, అందులో 20 మంది ఐటీ ఉద్యోగులు ఉండటం చూసి పోలీసులే నివ్వెరపోయారు.
వివరాల్లోకి వెళితే… ధూల్‌పేట ప్రాంతానికి చెందిన నీతుబాయ్ స్థానికంగా పోలీసుల నిఘా పెరగడంతో గచ్చిబౌలి ఠాణా పరిధిలోని నానక్రాంగూడలోకి తన మకాం మార్చింది. కిరాణం షాపు మాటున కుటుంబ సభ్యులతో కలిసి గంజాయి అమ్మకాలు మొదలు పెట్టింది. ఈక్రమంలో నిందితురాలిపై 2017 నుంచి 2024 వరకు ఎన్డీపీఎస్ చట్టం, ఎక్సైజ్ చట్టాల కింద 20 కేసులు నమోదయ్యాయి. పలుమార్లు అరెస్టయినా, జైలు శిక్ష అనుభవించినా, అక్రమ గంజాయి వ్యాపారాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. తాజాగా ఈగల్ టీమ్ జరిపిన దాడుల్లో తప్పించుకుని పారిపోయిన నిందితురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, 2023 ఆగస్టులో నమోదైన భారీ గంజాయి కేసులో నితూ బాయి వద్ద నుంచి భారీ స్థాయిలో అక్రమ ఆస్తులను అధికారులు గుర్తించారు. ఆ కేసులో రూ.40.30 లక్షల నగదు, రూ.1.53 కోట్ల డిపాజిట్లు ఉన్న 16 బ్యాంకు ఖాతాలు, సుమారు రూ.2 కోట్ల విలువైన స్థిరాస్తులను ఎన్డీపీఎస్ చట్టం కింద జప్తు చేశారు. అయినప్పటికీ జైలు నుంచి విడుదలైన వెంటనే మళ్లీ గంజాయి విక్రయాలను ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
గంజాయి కోసం క్యూ లైన్
2024 మార్చి 13న అప్పటి తెలంగాణ యాంటీ నారోటిక్స్ బ్యూరో (ప్రస్తుతం ఈగల్ ఫోర్స్) అధికారులు గచ్చిబౌలి పోలీసులతో కలిసి నానక్ రామ్ గూడలోని నితూ బాయి ఇంటిపై దాడి నిర్వహించారు. ఆ సమయంలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి నుంచే గంజాయి విక్రయాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించి, 22.6 కిలోల గంజాయి, రూ.22.10 లక్షల నగదు, రెండు మొబైల్ ఫోన్లు, ఒక ఫోన్ పే సానర్ను స్వాధీనం చేసుకున్నారు. అప్పు డు జరిగిన దాడి సమయంలో నీతూ బాయి ఇంటి బయట గంజాయి కొనుగోలు చేసేందుకు సుమారు 30 మంది వినియోగదారులు క్యూ లో నిలబడి ఉండటం అధికారులను విస్మయానికి గురిచేసింది. 1970-80 దశకాల్లో రేషన్ దుకాణాల వద్ద కనిపించే క్యూలను తలపించేలా పరిస్థితి ఉందని అధికారులు తెలిపారు.
పీడీ యాక్ట్ అమలు… హైకోర్టులో రద్దు
నితూ బాయి నిరంతరం నేరాలకు పాల్పడుతుండటంతో 2024 జూన్ 12న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆమెపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ ప్రయోగించారు. ‘డ్రగ్ ఆఫెండర్’గా గుర్తించి ఆమెను చంచల్ గూడ మహిళా ప్రత్యేక జైలుకు తరలించారు. అయితే 2024 అక్టోబర్ 17న తెలంగాణ హైకోర్టు పీడీ ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, 2025 ఆగస్టు 22న సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ప్రత్యేక అనుమతి పిటిషన్‌ను కొట్టివేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

