చంపాపేట: సామాన్యుల ఇండ్లు కూల్చి వారిని నిరాశ్రయులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమా..? అని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. కర్మన్‌ఘాట్ టీకేఆర్ కమాన్ నుంచి డీఎంఆర్ఎల్ చౌరస్తా వరకు ప్రధాన రోడ్డుకు ఇరువైపులా ఉండే సుమారు 300 ఇండ్లను కూల్చి 6 లేన్ల ైప్లెఓవర్ నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదన విషయంలో పునరాలోచించే విధంగా చూడాలని కోరుతూ.. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి గురువారం మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు.
గతంలో చేపట్టిన రోడ్డు విస్తరణ కారణంగా వారు సగానికి పైగా ఇండ్ల స్థలాలను కోల్పోయి అనేక ఇబ్బందులతో కాలం వెల్లదీస్తున్న క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం.. అదే ప్రాంతంలో 6 లేన్లతో కూడిన ైప్లెఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేసేందుకు ఇండ్ల బాధితులకు నోటీసులు ఇచ్చారన్నారు. తామంతా ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలిపోవడమే తప్ప.. మరో మార్గం కనిపించడం లేదని ఆ ఇండ్ల బాధితులు ఆవేదన చెందుతున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రభుత్వం ైప్లెఓవర్ నిర్మాణం పేరుతో ప్రజల ఇండ్లు కూల్చే విషయంలో పునరాలోచించాలన్నారు. కార్యక్రమంలో బాధితులు నవరత్నం, నరసింహాచారి, జగదీశ్ పాల్గొన్నారు.