 
                                                            జూబ్లీహిల్స్, అక్టోబర్ 30: అమాత్యులు వస్తే సమస్యలు చెప్పుకోవచ్చన్న ఆశతో వచ్చిన మహిళలకు నిరాశ ఎదురైంది. మంత్రుల చుట్టూ ఉన్న మందీ మార్బలం సామాన్యులను వారి చెంతకు వెళ్లనిస్తలేరు. మంత్రులైనా తమ కోసం ఎదురుచూస్తున్న వారిని గుర్తించి నిలబడి మాట్లాడుతారేమోనంటే అదీ లేదు. గురువారం యూసుఫ్‌గూడ ఎల్ఎన్ నగర్లో పాదయాత్ర చేసిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ హోటల్స్ వద్ద దోసెలు వేసుకుంటూ.. టీ తాగుతూ.. మిఠాయిలు తింటూ వాహనాల మీద వచ్చిపోయే వారికి హాయ్.. బాయ్ అని చెబుతూ ప్రచారం ముగించారు. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసిన మహిళలు మంత్రులను కలువకుండానే వెనుదిరిగారు. ఇండ్లు, రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు తదితర సమస్యల పరిష్కారం కోసం వచ్చామని మహిళలు చెప్పారు.
సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి 
– మాధవి, స్థానికురాలు
ఎన్నికల సమయంలోనైనా మంత్రులను కలవనియ్యకపోతే ఎలా.. సామాన్యులకు సమస్యలు ఉంటే ఎవరికి చెప్పుకోవాలి.. మంత్రులకు సమస్యలు చెప్పుకోవాలంటే పట్టించుకునే వారు లేరు.. పైగా దగ్గరికి కూడా వెళ్లనీయడం లేదు.
 
                            