హైదరాబాద్: కూకట్‌పల్లిలో అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా పట్టుబడింది. డ్రగ్స్ కేసులో ఐదుగురిని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఠా నుంచి రూ.2 కోట్ల విలువైన 840 గ్రాముల కొకైన్, ఎఫిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యులు ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరు తిరుపతికి చెందిన కానిస్టేబుల్ గుణశేఖర్‌గా గుర్తించామన్నారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని వెల్లడిచారు. అతనికోసం గాలిస్తున్నామని తెలిపారు.