Hyderabad | శేరి లింగంపల్లి, ఫిబ్రవరి 20: బెంగళూరులో ఓ కార్పొరేట్ సంస్థలో మంచి ఉద్యో గం, తనతో చదువుకునేందుకు వచ్చిన ఆఫ్రి కా వ్యక్తితో పరిచయం, ఆర్థిక అవసరాలు తనని డ్రగ్స్ సరఫరాదారుగా మార్చింది. మొదట కేవలం తాను ఉంటున్న గదిలో డ్ర గ్స్ నిల్వ ఉంచుకున్న యువతి, అనంతరం డబ్బు కోసం ఆఫ్రికా వ్యక్తి చెప్పిన వ్యక్తులకు డ్రగ్స్ సరఫరా చేయడం ప్రారంభించింది. ఇదే తరహాలో నగరానికి నిషేధిత ఎండీఎం ఏ డ్రగ్స్‌ను తీసుకొని వచ్చి, ఇక్కడ కొంతమందికి డ్రగ్స్ అందజేసే క్రమంలో పోలీసులకు పట్టుబడింది. మియాపూర్ పోలీసులు, టీజీ నాబ్ పోలీసులతో కలిసి మియాపూర్‌లో ఓ యువతిని వలపన్ని పట్టుకోగా, యువతి వద్ద నుంచి 60 గ్రాముల నిషేధిత ఎండీఎం ఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
సైబరాబా ద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి న వివరాలను మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ వినీత్, టీజీ నాబ్ డీఎస్పీ హరిచంద్రారెడ్డి గురువారం వెల్లడించారు. జార్ఖండ్‌కు చెందిన శతాబ్ది మన్నా(28) 2019లో బీబీఏ గ్రాడ్యుయేషన్ చేసేందుకు కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు వెళ్లింది. అక్క డే చదువు పూర్తి చేసిన శతాబ్ది ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ బెంగళూరులోని సోలా దేవనహళ్లి ప్రాంతంలో ఓ ఇళ్లు అద్దెకు తీసుకొని ఉంటుంది. కాగా, ఆఫ్రికా నుంచి చదువు కోసం భారత్ వచ్చి బెంగళూరులో ఉంటూ అంతరాష్ట్ర డ్రగ్స్ సరఫరాదారుడిగా మారిన వారెన్ కొకరాంగతో 2024లో శతాబ్దికి పరిచయం ఏర్పడింది.
శతాబ్దికి ఉన్న ఆర్థిక సమస్యల కారణంగా కొకరాంగ ఇచ్చి న డ్రగ్స్‌ను తన ఇంట్లో భద్రపరిచేందుకు అంగీకరించింది. ఇదే క్రమంలో కొకరాంగ చెప్పిన వ్యక్తులకు 100, 200 గ్రాముల చొ ప్పున డ్రగ్స్ సరఫరా చేసేది. అనంతరం, కొ కరాంగో ఆదేశాలతో బెంగళూరు, చుట్టు ప్ర క్కల ప్రాంతాల్లో డ్రగ్స్ సరఫరా చేయడం ప్రారంభించింది. ఇదే తరహాలో బెంగళూరు లో మారుతి మనోహర్ అనే డ్రగ్స్ వ్యాపారికి సైతం పలుమార్లు ఎండీఎంఏ సరఫరా చేసింది. కాగా, తెలంగాణలో డ్రగ్స్ సరఫరా మీద పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో నగరానికి చెందిన కొందరు ఎండీఎంఏ డ్రగ్స్ కోసం కొకరాంగను సంప్రదించారు. అదే సమయంలో బెంగళూరు పోలీసుల దృష్టి వీరి కదలికల మీద పడటంతో నగరానికి మకాం మార్చాలని పథకం వేశా రు.
వీరి పథకంలో భాగంగా నగరంలో డ్ర గ్స్ కోసం వీరిని సంప్రదించిన వారికి డ్రగ్స్ అందజేసేందుకు శతాబ్ది నగరానికి వచ్చింది. ఈ క్రమంలో మియాపూర్‌లో డ్రగ్స్‌తో ఉన్న శతాబ్ది సమాచారం టీజీనాబ్ అధికారులకు తెలియడంతో వారు మియాపూర్ పోలీసుల తో కలిసి బుధవారం దాడి చేశారు. డ్రగ్స్ స రఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్న శతాబ్ది మ న్నాను అదుపులోకి తీసుకొని గాలించగా, ఆమె వద్ద రూ.6లక్షల విలువైన 60గ్రా. ఎం డీఎంఏ డ్రగ్స్ లభించింది. పోలీసులు ఆమె వద్ద నుంచి 60 గ్రాముల ఎండీఎంఏను, ఓ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.