International Yoga Day | యోగాతో సంపూర్ణ ఆరోగ్యం.. ఈ ఆసనాలతో గుండె పదిలం
మారుతున్న కాలంతో పాటు మానవ జీవన విధానంలో కూడా అనేక మార్పులు వస్తున్నాయి. నగర జీవనవిధానంలో కాలంతో పోటీ పడుతూ, ఉరుకుల పరుగుల లైఫ్‌ను కొనసాగిస్తున్నారు.
- నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం
International Yoga Day | సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ): మారుతున్న కాలంతో పాటు మానవ జీవన విధానంలో కూడా అనేక మార్పులు వస్తున్నాయి. నగర జీవనవిధానంలో కాలంతో పోటీ పడుతూ, ఉరుకుల పరుగుల లైఫ్‌ను కొనసాగిస్తున్నారు. అయితే ప్రతి నిత్యం యోగాతో తమ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకునేందుకు కృషి చేయాలని యోగా గురువులు పేర్కొంటున్నారు. యోగాతో పరిపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, ఇది మన పూర్వీకులైన రుషుల నుంచి వారసత్వంగా వస్తుందని పేర్కొంటున్నారు. ప్రపంచానికి యోగాను నేర్పింది మన పూర్వికులేనని, ప్రస్తుతం యోగాను ప్రపంచం ఆచరిస్తున్నదంటున్నారు. యోగా వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని యోగాసాధకులు చెబుతున్నారు. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పలవురు యోగా టీచర్లు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ముఖ్యంగా గుండెను పదిలంగా ఉంచుకునేందుకు వేయాల్సిన ఆసనాలు నిత్యం పాటించాలని పలువురు సూచిస్తున్నారు.

భుజంగాసం: ఇది నాగుపాము భంగిమ. ఇది హృదయాన్ని బలంగా, భద్రంగా ఉంచడంతోపాటు వెన్నుపూస దృఢంగా మారడానికి తోడ్పడుతుంది. భుజంగాసనం మెన్‌ను నొప్పికి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది. భుజంగాసనం రోజు ఆచరిస్తే.. గుండెపోటు ప్రమాదాన్ని నివారించవచ్చని పేర్కొంటున్నారు.
ఉష్ర్టాసనం: ఇది ఒంటె భంగిమలో వేయాల్సి ఉంటుంది. జీర్ణశక్తిని పెంచేందుకు దోహదపడుతుంది. శరీరాన్ని బలవర్ధాయకంగా నిర్మిస్తుంది.
తాడాసనం: ఇది నిత్యం పాటిస్తే రక్తప్రసరణ సజావుగా ఉంటుంది. తాడాసనం హృదయ స్పందన రేటును మెరుగుపర్చేందుకు దోహదపడుతుంది.
శవాసనం: ఈ ఆసనంలో శరీరంలో ఎటువంటి కదలికలు లేకుండా నేలపై పడుకోవాలి. శవాసనం గుండె చప్పుడును సాధారణ స్థితిలో ఉంచడంతో పాటు ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇవేకాకుండా అనేక ఆసనాలు వేసేందుకు యోగా గురువుల సూచనలు, సలహాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి..
గత కొన్నేండ్లుగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన అనంతరం, యోగా-ముద్రలపై పరిశోధనలు చేస్తున్నాను. మా నాన్న ధరణిప్రగడ ప్రకాశ్‌రావు 25 ఏండ్లకు పైగా యోగాచార్యుడిగానే కాకుండా ముద్రలతో నిష్ణాతులుగా పేరుతెచ్చుకున్నారు. సంపూర్ణ ముద్రా విజ్ఞానంపై మూడు పుస్తకాలను రాశారు. నేను కొన్నేండ్లుగా థెరపీ యోగా టీచర్‌గా, ప్రెగ్నెన్సీ యోగా టీచర్‌గా సేవలందిస్తున్నాను. గర్భిణులకు సాధారణ ప్రసవాలు అయ్యేలా శిక్షణ ఇస్తున్నాను. యోగా దినోత్సవం సందర్భంగా అయుష్ విభాగంతో కలిసి హైటెక్స్ ఎగ్జిబిషన్ కేంద్రంలో ఉచితంగానే యోగా తరగతులు అందిస్తున్నాం.
– ధరణిప్రగడ దీప్తి, యోగా టీచర్
యోగాలో ఆరోగ్య పరిరక్షణ సూత్రాలు..
యోగాను నిత్యం ఆచరిస్తే అనేక ఆరోగ్యపరిరక్షణ సూత్రాలు పాటించివాళ్లం అవు తాం. ముఖ్యంగా నగరీకరణ పెరుగుతున్న తరుణంలో యోగా నిత్యజీవతంలో కీలకంగా మారుతుంది. నేను గత కొన్నేండ్లుగా యోగా టీచర్‌గా కొనసాగుతున్నాను. మనిషిని పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే ప్రధాన క్రియల్లో యోగా మొదటిదిగా చెప్పుకోవాలి. ఆందోళన తగ్గించడంతోపాటు జీర్ణవ్యవస్థను, హృదయస్పందన, నాడీ వ్యవస్థను చురుకుగా ఉంచేందుకు దోహదపడుతుంది. అందరూ నిత్యం యోగా పాటిస్తే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేసినవాళ్లమవుతాం.
– వాణిరెడ్డి, యోగా టీచర్, జెక్కాలనీ, సనత్‌నగర్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

