సిటీబ్యూరో, మార్చి 8 (నమస్తే తెలంగాణ):సాధికారత, స్వావలంబన, శ్రమశక్తికి ప్రతిరూపాలుగా నిలుస్తున్న అతివలకు నగరం జేజేలు పలికింది. అన్ని రంగాల్లో సత్తాచాటుతున్నారంటూ కీర్తించింది. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గ్రేటర్లో ఘనంగా జరుపుకొన్నారు. పలు చోట్ల ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. పలువురు మహిళలను సత్కరించారు. బల్దియాలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్‌రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. మహిళలు లక్ష్యసాధనలో వెనకడుగు వేయవద్దని, ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ముందుకు సాగాలని మేయర్ పిలుపునిచ్చారు. ఎవరైనా వేధింపులకు గురైతే..తనను లేదా డిప్యూటీ మేయర్‌ను నేరుగా సంప్రదించాలన్నారు.
అతివల రక్షణకు ఇప్పటికే షీటీమ్స్ కూడా ఉన్నాయని గుర్తు చేశారు. ఇక గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మహిళా ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. నెక్లెస్‌రోడ్‌లో తీసిన ర్యాలీలో మహిళలు, యువతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని మీర్‌పేటలో జరిగిన సంబురాల్లో మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. కాగా, హన్మకొండలోని కేయూ వర్సిటీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి ఎంపికైన 27 మంది ప్రతిభావంతులకు మంత్రి సత్యవతి రాథోడ్ అవార్డులు, నగదు, ప్రశంసాపత్రాలను అందజేయగా, వారిలో హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు, మేడ్చల్ నుంచి ఒకరు ఉన్నారు.
ముందుకెళ్లండి
మహిళలకు సహ నం, ఓర్పు ఎకువని, లక్ష్య సాధనలో వెనకడుగు వేయకుండా ఎన్ని అడ్డంకులు వచ్చినా లక్ష్యాన్ని చేరుకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు విజయలక్ష్మి, యూసీడీ సౌజన్య, జాయింట్ కమిషనర్లు ఉమాప్రకాశ్, శశిరేఖ, జోనల్ కమిషనర్ మమత, సెక్రటరీ లక్ష్మి, డిప్యూటీ కమిషనర్ మంగతాయారు, మహిళా ఉన్నతాధికారులు, ఉద్యోగులు, శానిటరీ వరర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి జోనల్ కమిషనర్ మమత
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన జరుపుకుంటామని, ఈ దినోత్సవాన్ని మొదటగా మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారని జోనల్ కమిషనర్ మమత అన్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన క్రీడల్లో మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గెలుపొందిన మహిళా ఉద్యోగులకు బహుమతులను అందజేశారు. అనంతరం జీహెచ్ఎంసీ ఆవరణలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి, ఉద్యోగులతో కలిసి ఆమె మొకలు నాటారు.
వేధింపులకు గురైతే నన్ను సంప్రదించండి : మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, న్యూట్రిషన్ కిట్, ఆసరా పింఛన్లు తదితర సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మేయర్ విజయలక్ష్మి తెలిపారు. ఎవరైనా వేధింపులకు గురైతే నేరుగా నన్ను గానీ, డిప్యూటీ మేయర్‌ను గాని సంప్రదిస్తే కచ్చితంగా పరిషరిస్తామన్నారు. వేధింపులకు గురైతే మహిళలు ధైర్యంగా షీ-టీమ్స్‌కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. హైదరాబాద్ మహా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మహిళా శానిటరీ వరర్ల పాత్ర ఎంతో కీలకమమన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా 30 సరిళ్లలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులలో ఒకో సరిల్ నుంచి ఒక ఉత్తమ మహిళా వరర్ను ఎంపిక చేసి అవార్డు ఇచ్చి సన్మానించడం సంతోషంగా ఉన్నదన్నారు.ప్రతి పారిశుధ్య మహిళ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మేయర్ కోరారు.
ప్రతి మంగళవారం మహిళా ఆరోగ్యం: డిప్యూటీ మేయర్
మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన మహిళలను సన్మానించుకోవడం వల్ల ముందు తరాల వారిని చైతన్యవంతులను చేయడానికి తోడ్పతుందని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి అన్నారు. మహిళా ఆరోగ్యం అనే కొత్త కార్యక్రమాన్ని ప్రతి మంగళవారం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మహిళా ఉద్యోగులకు సన్మానం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జీహెచ్ఎంసీ సీపీఆర్వో విభాగంలో ఉత్తమ సేవలు అందించిన మహిళా ఉద్యోగులకు సీపీఆర్వో మహమ్మద్ అలీ ముర్తుజా, ఏఎంసీ జీవన్‌కుమార్‌లతో కలిసి సన్మానించారు. సన్మానించిన వారిలో సూపరింటెండెంట్లు డి.శైలజ, పద్మ, ఓఎస్ కె. లతను సన్మానించి జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో మోసిన్, రోహిత్, రమేశ్, ఆనంద్, మహమ్మద్ తౌఫిక్, యాదగిరి, శ్రీను, నరేందర్, నర్సింగ్, మహేందర్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.