ఘట్కేసర్, డిసెంబర్2: పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలోని నారాయణ కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోచారం సీఐ రాజు వివరాల ప్రకా రం.. బానోత్ తనూష్ నాయ క్ (16) కళాశాలలో ఎంపీసీ చదువుతున్నాడు. సోమవా రం సాయంత్రం బాత్రూంలోకి వెళ్ళి ఎంత సేపటికి రాకపోవడంతో తోటి విద్యార్థులు వెళ్లి పరిశీలించగా ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
విషయం తెలసుకున్న కళాశాల యాజమాన్యం సమీపంలోని ప్రైవేటు దవాఖానకు తరలించగా వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దీంతో కళాశాల యాజమాన్యం పోచారం పోలీసులకు, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం విద్యార్థి మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. కళాశాల వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కాగా.. తమ కుమారుడి ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యమే కారణమంటూ కళాశాల ముందు విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు.