హైదరాబాద్: హైదరాబాద్‌లోని బాచుపల్లిలో (Bachupalli) విషాదం చోటుచేసుకున్నది. ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ (Inter Student) చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య (Student Suicide) చేసుకున్నది. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌కు చెందిన వర్షిత (16) బాచుపల్లిలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది. తానుంటున్న హాస్టల్ గదిలో వర్షిత ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
గమనించిన హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.