– 474 మంది పారిశుధ్య కార్మికులకు, 76 మంది ఆశాలకు సన్మానం..
– ఆడపడుచులకు ప్రత్యేక కానుకలతో ఆత్మీయ విందు..
– 326 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి. షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ..
– యూసుఫ్‌గూడలో వేడుకగా ముగిసిన మహిళా దినోత్సవ సంబురాలు..
జూబ్లీహిల్స్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మహిళా బంధు కేసీఆర్’ వేడుకలు ఘనంగా ముగిశాయి. వేడుకలలో భాగంగా యూసుఫ్‌గూడ సర్కిల్లో 474 మంది పారిశుధ్య కార్మికులకు, 76 మంది ఆశా వర్కర్లకు సన్మానం చేశారు.
నియోజకవర్గంలోని ఆడపడుచులకు ఆత్మీయ విందు నిర్వహించడంతో పాటు 326 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తో కలిసి ఆత్మీయ విందులో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మహిళా దినోత్సవ వేడుకలను అభినందించారు.
ఈ సందర్భంగా జూబ్లీహిల్స్, యూసుఫ్‌గూడ, బోరబండ, రహ్మత్‌నగర్, వెంగళరావునగర్, ఎరగడ్డ, సోమాజీగూడ, షేక్‌పేట్ డివిజన్లకు చెందిన మహిళలకు ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ప్రత్యేక కానుకలు పంపిణీ చేశారు. జూబ్లీహిల్స్‌లో మూడు రోజులపాటు నిర్వహించిన ‘మహిళా బంధు కేసీఆర్’ వేడుకలు స్ఫూర్తిదాయకంగా నిర్వహించారు. యూసుఫ్‌గూడలో చివరిరోజు మహిళా దినోత్సవ సంబురాలు ఘనంగా ముగిశాయి.