 
                                                            షేక్‌పేట్ అక్టోబర్ 30: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షేక్‌పేట్ డివిజన్లో రోడ్‌షో శుక్రవారం నిర్వహించనున్నారు. దీని కోసం గురువారం మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్, బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి, నందికంటి శ్రీధర్ తదితరులు షేక్‌పేట్ నాలా చౌరస్తాలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో ముందంజలో ఉందన్నారు. రోడ్ షోను పకడ్బందీగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ రోడ్‌షోలో కేటీఆర్‌తో పాటు అభ్యర్థి మాగంటి సునీత, పార్టీ ప్రముఖులు పాల్గొంటారని పార్టీ ఇన్చార్జి దాసోజు శ్రవణ్‌కుమార్ తెలిపారు.
రూట్ మ్యాప్‌పై సమాలోచన..
కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించే ప్రాంతాల రూట్ మ్యాప్‌పై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి, సోమాజీగూడ డివిజన్ పార్టీ అధ్యక్షుడు అప్పుఖాన్ తదితరులతో చర్చించారు. దీనికి ముందు వీరందరూ కలిసి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పలుప్రాంతాల్లో ఉపఎన్నిక ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌ను గెలిపించాలని కోరారు.
 
                            