ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపక ప్రమోషన్లలో తీవ్ర అన్యాయం జరిగిందని, దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని ఓయూ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) అధ్యక్షుడు ప్రొఫెసర్ మనోహర్ మండిపడ్డారు. సెప్టెంబర్లో వర్సిటీలో జరిగిన సీఏఎస్ ప్రమోషన్లలో 48 మంది అధ్యాపకులకు ప్రమోషన్లు నిరాకరించారని తెలిపారు. దీనిని నిరసిస్తూ మంగళవారం ఇంజినీరింగ్ కళాశాల ఎదుట ఆందోళన చేశారు.