మేడ్చల్, అక్టోబర్14(నమస్తే తెలంగాణ): వైసీపీ, బీజేపీలు కుట్ర చేసి ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్టు చేయించారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. శనివారం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును అరెస్టు చేసి జైల్లో పెట్టడం బాధ అనిపించిందన్నారు.
తనకు చంద్రబాబు రాజకీయ భిక్ష పెట్టడం వల్లే తాను ఎంపీ అయినట్లు పేర్కొన్నారు. ఈ వయసులో చంద్రబాబును అరెస్టు చేసి బాధ పెట్టడం సరికాదన్నారు. లోకేశ్ తన తండ్రి చంద్రబాబు గురించి మాట్లాడిన తీరు తనకు బాధ కల్గించిందన్నారు.