కందుకూరు, మే 20 : అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని పంచాయతీ కార్యదర్శి ఉమాదేవి తెలిపారు. బుధవారం మండల పరిధిలోని కొత్తగూడ గ్రామంలో మంజూరు పత్రాలను అందజేసిన అనంతరం కొబ్బరి కాయలు కొట్టి నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి ఉమాదేవి మాట్లాడుతూ.. ప్రభుత్వం సూచించిన విధంగా ఇంటి నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఇష్టానుసారంగా ఇండ్లను నిర్మించుకోవద్దని పేర్కొన్నారు. ఇంటి నిర్మాణం చేపడితే దశలవారీగా రూ.5 లక్షల వరకు ప్రభుత్వం అందజేస్తుందని వివరించారు.