శంషాబాద్ రూరల్, మే 30 : బెంగళూరు నుంచి నాగపూర్ వెళ్తున్న ఇండిగో విమానం శనివారం ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. సాంకేతికలోపం తలెత్తడంతో గుర్తించిన పైలెట్.. వెంటనే శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం ఇచ్చారు.
దీంతో అధికారులు అత్యవసర ల్యాండింగ్‌కు అవకాశం కల్పించారు. విమానంలో 126 మంది ప్రయాణికులు ఉన్నారు. సురక్షితంగా ఎయిర్‌పోర్టులో దించడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. పైలెట్‌ను అధికారులు, ప్రయాణికులు అభినందించారు.