దేశంలోనే మొట్టమొదటి ‘ఆర్గాన్ డొనేషన్ క్యాంపెయిన్ ఆన్‌వీల్స్ వాహనం అందుబాటులోకి వచ్చింది. గచ్చిబౌలిలోని హెచ్ఎండీఏ ఆఫీసులో మంత్రి కేటీఆర్, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి ఈ వాహనాన్ని ప్రారంభించారు. గతంలో జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్టు ద్వారా 400 మంది అవయవదానానికి అంగీకరించారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి గుర్తు చేశారు. ఆ కార్యక్రమ స్ఫూర్తితో మంత్రి కేటీఆర్ సహకారం, మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆధ్వర్యంలో అవయవదాతలు ఇంటి వద్దే రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ప్రత్యేక వాహనాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ అవయవదానం చేసి మరో ఏడుగురికి జీవితం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో రమాకాంత్, కల్యాణ్, స్వప్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-ఎల్బీనగర్, ఫిబ్రవరి 23