శామీర్‌పేట, జూన్ 3 : వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తూనే రైతుల దిగుబడులు పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం, ఎరువుల శాఖ పనిచేస్తుందని కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి అరుణ్ అభిప్రాయపడ్డారు. కోరమండల్ ఫర్టిలైజర్స్ సంస్థ నూతనంగా తయారు చేసిన నానో డీఏపీ ఎరువును శనివారం శామీర్‌పేట మండలంలోని లియోనియా రిసార్ట్స్‌లో లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ… వాతావరణ కాలుష్యాన్ని నివారించాలనే ఉద్దేశంతో కోరమండల్ ఫర్టిలైజర్స్ సంస్థ చేస్తున్న ప్రయోగాలు అద్భుతమని, రాబోయే తరాలకు ఆదర్శమన్నారు. నానో డీఏపీ టెక్నాలజీని రైతులు సద్వినియోగం చేసుకుని ఆధిక దిగుబడులు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారి నీరజ, కోరమండల్ ఫర్టిలైజర్స్ సంస్థ వైస్ చైర్మన్ అరుణ్ అలుప్పన్, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ శంకర్ సుబ్రహ్మణ్యం, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.