సిటీబ్యూరో, ఏప్రిల్ 25(నమస్తే తెలంగాణ) : అభివృద్ధి పేరిట కాంగ్రెస్ సర్కార్.. రైతులను అరిగోసలు పెడుతున్నది. గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు- 2 అలైన్మెంట్ ఖరారు చేస్తూ రేవంత్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికోసం హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ 2030లో మార్పులకు ఆదేశించింది. అవుటర్ రింగు రోడ్డు నుంచి రీజనల్ రింగు రోడ్డు వరకు అనుసంధానం చేయాలనే సాకుతో వందల ఎకరాల సాగు భూములను సేకరించేందుకు రంగం సిద్ధం చేసింది.
అయితే ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ గడిచిన ఆరు నెలలుగా వికారాబాద్ జిల్లా రైతులు పెద్ద ఆందోళనలు, హెచ్ఎండీఏ కార్యాలయం ముట్టడి, అభ్యంతరాలు వ్యక్తం చేసినా పట్టించుకోని ప్రభుత్వం..అలైన్మెంట్ ఖరారుతో ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమవుతున్నది. ఆరు నెలల కిందట ఈ ప్రాజెక్టును ప్రతిపాదించిన నాటి నుంచే రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల రైతులు రోడ్డెక్కారు. తమ జీవనాధారమైన భూములను ప్రాజెక్టుతో కోల్పోతామని, ఈ మార్గంలో 300 ఫీట్ల వెడల్పుతో రోడ్లను చేపట్టాల్సిన అవసరమే లే దని ఆగ్రహాం వ్యక్తం చేశారు.
సన్న, చిన్నకారు రైతుల భూములే లక్ష్యంగా, బడా భూ స్వా ముల భూములకు డిమాండ్ తీసుకురావడ మే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రవాణా సదుపాయాలు కంటే రియల్ వ్యాపారం విస్తృతంగా సాగుతుందని, దీంతో భూములు ఇచ్చే ది లేదని చెప్పినా అలైన్మెంట్ ఖరారు చేయ డం ఇప్పడు ఆందోళన కలిగిస్తోంది. ఇక అధికారులు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణల్లోనూ వ్యతిరేకించిన రైతులు.. ప్రభుత్వం మాత్రం వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదనే విమర్శలున్నాయి. రైతుల అభ్య ంతరాలను పరిశీలించకుండానే ఆలైన్మెంట్ ఖరారు చేశారనే విమర్శలు వస్తున్నాయి.
గ్రీన్‌ఫీల్డ్ పోయేదిలా..
శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ వద్ద ఓఆర్ఆర్ నుంచి మొదలై, వికారాబాద్ జిల్లా పరిధిగి మండలం చిట్యాల్ వద్ద ట్రిపులార్లో కలిసేలా 51.4 కిలోమీటర్ల రహదారిని రూపొందించనున్నారు. ఇందులో ప్రభావిత మండలాలుగా శంషాబాద్, షాబాద్, కొందుర్గ్, చౌదరిగూడెం, మొయినాబాద్, పరిగి(వికారాబాద్ జిల్లా)తోపాటు, కొత్వాల్‌గూడ, హిమయత్ సాగర్, నార్కుడ, సుల్తాన్‌పల్లి, కాచారం, రాయన్నగూడ, మల్కారం, సోలిపెట, హయతాబాద్, పెద్దవేడు, దామర్లపల్లి, మాచన్‌పల్లి, నాగర్‌కుంట, బోన్గిరిపల్లి, చుక్కంపేట్, మూత్రూర్, ఉమ్మెత్యాల్, తుమ్మలపల్లి, ఎంకేపల్లి, యాబాజీగూడ, రాపోల్, చిట్యాల్ వరకు ఉన్న రోడ్డుకు ఇరువైపులా 150 ఫీట్ల దూరంలో ఉన్న పచ్చని పోలాలపై కనుమరుగు కానున్నాయి.
దాదాపు 20 గ్రామాల మీదుగా ఈ రహదారి ప్రభావం చూపునుండగా, గ్రీన్ ఫీల్డ్ రహదారిపతో ఏకంగా 330 అడుగుల వెడల్పుతో పంట పొలాల విధ్వంసానికి సర్కారు స్కెచ్ గీసింది. ఇంత భారీ వెడల్పుతో రోడ్డు వేయడం వలన సారవంతమైన సాగుభూములతోపాటు, అనేక చోట్ల బోర్లు, బావులు, ఇండ్లను కూడా కోల్పో యే ప్రమాదం ఉందనీ రైతులు ఆందోళన చెందుతున్నారు. పెరి అర్బన్ కనెక్టవిటీ పేరిట రైతుల భూములను చెరబడుతున్న సర్కార్.. అభివృద్ధి పేరిట జీవనాధారమే లేకుండా చేస్తున్నదని మండిపడుతున్నారు.
త్వరలో జంక్షన్ పనులు..
కొత్వాల్‌గూడ వద్ద ఓఆర్ఆర్తో ఈ కొత్త రోడ్డును అనుసంధానించే జంక్షన్ పనులను త్వరలోనే ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. రైతుల సమస్యలను పరిష్కరించకుండా, నష్టపరిహారంపై స్పష్టత ఇవ్వకుండానే పనులు మొదలుపెట్టడంపై క్షేత్రస్థాయిలో రైతులు ఆగ్రహాంతో ఉన్నారు. ఇప్పటికైనా సర్కార్ పునరాలోచన చేసి, రైతుల ప్రయోజనాలు, జీవనాధారాలకు కాపాడాలని నోటిఫై చేసిన రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ప్రాజెక్టుకు భూ సేకరణకు సహకరించేది లేదని తేల్చి చెబుతున్నారు.