శంషాబాద్ రూరల్, మార్చి 25: నిండు అసెంబ్ల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి తొక్కుకుంటూ వచ్చిన అంటున్నాడు.. మీరేమో రైతులను తొక్కుకుంటూ మా భూములు లాక్కుంటున్నారు ఇదెక్కడి న్యాయమంటూ రామంజాపూర్ గ్రామసభలో రైతు ప్రభుసాగర్ అధికారులను నిలదీశారు. బుధవారం శంషాబాద్ మండలంలోని రామంజాపూర్ గ్రామంలో రేడియల్ రోడ్డు కోసం గ్రామసభలు నిర్వహించారు. గ్రామసభలో రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ చంద్రారెడ్డి పాల్గొని రైతులకు ఇబ్బందులు లేకుండా రేడియల్ రోడ్డు నిర్మాణం కోసం భూములు సేకరిస్తామని ప్రకటించారు. దీంతో గ్రామానికి చెందిన ప్రభుసాగర్తో పాటు పలువురు రైతులు మాట్లాడుతూ.. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం ఇస్తేనే రోడ్డు పనులకు సహకరిస్తాం… లేదంటే రోడ్డు పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు.
డిప్యూటీ కలెక్టర్ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. రైతులు గ్రామసభలలో లేవనెత్తిన అంశాలను ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని అన్నారు. కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఆర్డీవో వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ రవీందర్ దత్, సర్పంచ్ లావణ్య, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, ప్రకాష్, మాధవరెడ్డి, రైతులు పాల్గొన్నారు. మల్కారం, రాయన్నగూడ, కాచారం, సుల్తాన్‌పల్లి గ్రామాలలో నిర్వహించిన గ్రామ సభలలో రైతులు ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తేనే రోడ్డు వేయడానికి సహకరిస్తామని.. లేకపోతే అడ్డుకుంటామని హెచ్చరించారు.ఆయా గ్రామాల సర్పంచ్లుభిక్షపతిరెడ్డి, ప్రభాకర్‌గౌడ్, రాం గోపాల్, నాయకులు, రైతులు పాల్గొన్నారు.