ట్రాఫిక్ పోలీసుల భయంతో..
నంబర్ ప్లేట్ లేకపోవడంతోపాటు ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న ముగ్గురు యువకులు ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో రాంగ్రూట్లో వెళ్తూ కారును ఢీకొట్టిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
- రాంగ్రూట్లో వెళ్లి కారును ఢీకొట్టిన యువకులు
- ముగ్గురికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
బంజారాహిల్స్, జూన్ 14: నంబర్ ప్లేట్ లేకపోవడంతోపాటు ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న ముగ్గురు యువకులు ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో రాంగ్రూట్లో వెళ్తూ కారును ఢీకొట్టిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బోరబండకు చెందిన ప్రకాశ్, ఫరీద్, కిరణ్ మంగళవారం రాత్రి పదిన్నర ప్రాంతంలో బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వైపు నుంచి తెలంగాణ భవన్ వైపు స్కూటీపై వెళ్తున్నారు. తెలంగాణ స్టడీ సర్కిల్ సమీపంలోకి రాగానే రోడ్డుపై ట్రాఫిక్ పోలీసులు బారికేడ్లు పెట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న విషయాన్ని స్కూటీ నడిపిస్తున్న ప్రకాశ్ గమనించాడు.
స్కూటీకి నంబర్ ప్లేట్ లేకపోవడంతోపాటు ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు. హెల్మెట్ కూడా లేకపోవడంతో తమను ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటారని భావించిన ప్రకాశ్.. స్కూటీని వెనక్కి తిప్పాడు. రాంగ్రూట్లో అతివేగంగా వెళ్తూ ఎదురుగా ఉన్న రేంజ్ రోవర్ కారును ఢీకొట్టాడు. దీంతో కారు నడిపిస్తున్న తార్నాక ప్రాంతానికి చెందిన అర్బాజ్ ఫారూఖీ ఒక్కసారిగా షాక్‌కు గురై బ్రేకులు వేశాడు. ఈ ఘటనలో స్కూటీపై ఉన్న ముగ్గురు యువకులు గాయపడ్డారు. వీరిలో ప్రకాశ్ కాలు విరగ్గా.. మిగిలిన ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు రేంజ్ రోవర్ కారు యజమాని అర్బాజ్ ఫారూఖీ బుధవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

