సరికొత్త డిజైన్లతో కూడిన వస్ర్తాలు, ఆభరణాలు నగర వాసులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో దసరా, గణపతి పండుగలను పురస్కరించుకొని సూత్ర ఫ్యాషన్ ఎగ్జిబిషన్ పేరిట ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నటి కామాక్షి భాస్కర్ల విచ్చేసి ప్రముఖ మోడల్స్తోపాటు నిర్వాహకుడు ఉమేశ్ మద్యాన్తో కలిసి శనివారం జ్యోతిప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు.
ఈ ప్రదర్శన ఈనెల 18వ తేదీ వరకు కొనసాగుతుందని, దేశంలోని పలు నగరాల నుంచి ప్రముఖ డిజైనర్లు రూపొందించిన వస్ర్తాలు, ఆభరణాలు, గృహోపకరణ ఉత్పత్తులను ప్రదర్శించారు. అనంతరం నటి కామాక్షి భాస్కర్లతో కలిసి సెల్ఫీలు దిగుతూ మోడల్స్ సందడి చేశారు. – మాదాపూర్, సెప్టెంబర్ 16