సిటీబ్యూరో, మార్చ్ 15(నమస్తే తెలంగాణ): మణికొండలో హైటెన్షన్ విద్యుత్ తీగల కింద ఉన్న స్థలంతో పాటు నాలాను ఆక్రమించి ఏర్పాటు చేసిన రేకుల ప్రహారీని శనివారం హైడ్రా తొలగించింది.
హైటెన్షన్ వైర్ల కింద నిర్మాణాలు చేపట్టవద్దన్న నిబంధనలను అతిక్రమించడం..బుల్కాపూర్ నాలాను ఓ నిర్మాణ సంస్థ కబ్జా చేస్తున్నదంటూ స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండు రోజుల క్రితం హైడ్రా బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. మణికొండ మర్రిచెట్టు వద్ద ఓ నిర్మాణ సంస్థ నాలాను కలిపేసుకుని హైటెన్షన్ వైర్ల కింద నిర్మాణాలు చేసినట్లు నిర్దారణ కావడంతో రేకుల ప్రహారీని తొలగించింది.