శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 3: శంషాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న సంపత్‌నగర్ కాలనీలో హెచ్ఎండీఏ పార్కు స్థలంలో వెలసిన అక్రమ నిర్మాణాలను సోమవారం తెల్లవారుజామున హైడ్రా సీఐ తిరుమలేశ్గౌడ్ ఆధ్వర్యంలో కూల్చివేశారు.
దీంతో పాటు ఊటుపల్లి ఇంద్రానగర్ కాలనీలో రోడ్లును ఆక్రమించి చేట్టిన నిర్మాణాలను కూడా నేలమట్టం చేశారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న అధికారులను అక్రమ నిర్మాణదారులు అడ్డుకునే ప్రయత్నం చేయగా, వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని నిర్మాణాలను కూల్చివేశారు.