Illegal Constructions | కుత్బుల్లాపూర్, నవంబర్ 21: పేట్ బషీరాబాద్ సర్వే నంబర్ 25/1 ప్రభుత్వ స్థలంలో వెలసిన అక్రమ నిర్మాణాన్ని కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ అధికారులు గురువారం కూల్చివేశారు. ఈ నెల 14న ‘నమస్తే’లో ‘అధికారం మనదైతే…అడ్డేముంది’ శీర్షిక పేరుతో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. గతంలో ఇదే సర్వేలో వెలసిన అక్రమ నిర్మాణాన్ని అధికారులు కూల్చివేశారు.
అయితే కబ్జాదారుడు తిరిగి యధావిధిగా నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పుడు తిరిగి కూల్చివేశారే తప్ప.. ఆ స్థలాన్ని పరిరక్షించేందుకు అధికారులు శాశ్వత చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సమీపంలోనే ఉన్న మరో అక్రమ నిర్మాణం సర్వే నంబర్ 25/2లో వెలసిన అక్రమ నిర్మాణంపై అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడం చర్చానీయాంశంగా మారింది. ఆర్ఐ విజయ్‌ని వివరణ కోరగా, లీగల్‌గా ముందుకెళ్లాల్సి ఉన్నదని, త్వరలోనే అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.