పైసలు ఇచ్చినోళ్లకే పనులు
జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగంలో అక్రమాల పర్వం తారాస్థాయికి చేరుకున్నది.
- కాంట్రాక్టర్ల నుంచి అక్రమ వసూళ్లు
- ,ఇంజినీరింగ్ పనుల్లో అవినీతి ‘అక్రమారులు’
- టెండర్లలో రిజర్వేషన్ల ఉల్లంఘన.. నిబంధనలకు తూట్లు
- లంచాలు ఇచ్చిన వారికే పనులు కేటాయింపు
- అన్నీ తామై చక్రం తిప్పుతున్న కొందరు అధికారులు
- ఏసీబీకి బాధిత కాంట్రాక్టర్ల ఫిర్యాదులపై విస్తృత చర్చ
సిటీబ్యూరో, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగంలో అక్రమాల పర్వం తారాస్థాయికి చేరుకున్నది. అనుకూల వ్యక్తులకే టెండర్లు దక్కేలా నిబంధనలను చేర్చి టెండర్లు పిలిచి వారికే పనులు కట్టబెట్టడం, రిజర్వేషన్ల టెండర్లలో ఆక్రమాలకు పాల్పడుతుండడం, అన్నింటి కంటే టెండరుదక్కేలా ఏజెన్సీ ముందే ఖరారు కావడం పరిపాటిగా మారుతోంది. అడ్డదారిలో పైరవీకారులకే పనులు దక్కుతున్నాయన్నది ప్రధాన అరోపణ. ఈ క్రమంలోనే ఎల్బీనగర్ జోనల్ కార్యాలయంలో ఏండ్ల తరబడి ఒకే స్థానంలో తిష్ట వేసిన ఇద్దరు మహిళా అధికారుల పనితీరుపై బాధిత కాంట్రాక్టర్లు ఏసీబీకి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.
నిబంధనల ప్రకారం దకాల్సిన అర్హులకు కాకుండా, కమీషన్లు సమర్పించుకున్న కేటగిరీల వారికే పనులను అప్పనంగా కట్టబెడుతున్నారని, ఈ ప్రక్రియలో ప్రభుత్వ ఉత్తర్వులను కాగితాలకే పరిమితం చేస్తూ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నారని అరోపణలు ఉన్నాయి. పనుల కేటాయింపు నుంచి బిల్లుల చెల్లింపు వరకు ప్రతి దశలోనూ సంబంధిత అధికారులకు నజరానాలు తప్పనిసరిగా మారాయని, ఎస్సీ, ఎస్టీ, సాగర/వడ్డెర వర్గాలకు కేటాయించాల్సిన 24% రిజర్వేషన్ టెండర్లను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారన్న బాధిత కాంట్రాక్టర్లు వాపోతున్నారు.
బదిలీల నియమ,నిబంధనలకు తూట్లు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్దిష్ట కాలమితి పూర్తయిన వెంటనే ఉద్యోగులను బదిలీ చేయాల్సి ఉండగా, ఎల్బీనగర్ పరిధిలో ఇది అమలు కావడం లేదు. హెచ్డీ (హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్) అధికారిణి దాదాపు పదేండ్లుగా, మరో మహిళా ఇంజినీర్ (ఏఈ) 8 ఏండ్లకు పైగా ఒకే స్థానంలో కొలువుదీరి ఉండడం గమనార్హం. ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుంటూ.. బదిలీలు కాకుండా ఏళ్ల తరబడి ఇకడే తిష్టవేసి తమ సామ్రాజ్యాన్ని ఏలుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సాధారణ ప్రజలు, కాంట్రాక్టర్లు పనుల నిమిత్తం కార్యాలయానికి వస్తే పనులు చేయకుండా తీవ్రంగా వేధిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెండర్ నుంచి బిల్లుల దాకా సంబంధిత అధికారిణి కీలకం కావడంతో ఎకువ మొత్తంలో లంచాలు ఇచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. విధుల్లో భాగంగా బిల్లుల చెల్లింపుల కోసం వచ్చే కాంట్రాక్టర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని బాధిత కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ) లతో పాటు ఇతర ఉన్నతాధికారులకు కూడా ఈ అక్రమాల్లో భాగస్వామ్యం ఉందనే ప్రచారం జరుగుతోంది.
ఏసీబీ, విజిలెన్స్‌కు ఫిర్యాదులు
ఈ దందాపై విసిగిపోయామంటూ పలువురు బాధితులు, కాంట్రాక్టర్లు ఆధారాలతో సహా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), విజిలెన్స్ విభాగాలకు ఫిర్యాదులు చేశారు. టెండర్ల కేటాయింపులో జరిగిన అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై సమగ్ర విచారణ జరిపి దోషులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. కాగా టెండర్ల ప్రక్రియ అంతా నిబంధనల ప్రకారం పారదర్శకంగా జరగాలని, ఎస్సీ, ఎస్టీ, సాగర,వడ్డెర రిజర్వేషన్ టెండర్లలో అక్రమాలను అరికట్టి అర్హులకు తగిన న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

