
కుత్బుల్లాపూర్, జనవరి 30 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. రాబోయే తరాలకు అనుగుణంగా వందల కోట్ల నిధులతో బస్తీల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఆదివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలు కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు వారి సమస్యలపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాలిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ భవిష్యత్తరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.
సూరారం డివిజన్ పరిధిలోని శ్రీరామ్‌నగర్ కాలనీ, వైష్ణవ్ ఎన్క్లేవ్, వేమారెడ్డినగర్ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో పాటు కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ ఎమ్మెల్యే వివేకానంద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయా కాలనీల్లో సీసీరోడ్లు, భూగర్భ డ్రైనేజీ, వాటర్ సరఫరా లైన్ పనులు పూర్తి చేసేలా కృషి చేయాలని వినతిపత్రం ఇచ్చారు.
జీడిమెట్ల డివిజన్ కోల్కాలువ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను ముంపు ప్రాంతమైన ఎన్సీఎల్ ఎన్క్లేవ్ సంక్షేమ సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సమస్య పరిష్కారానికి కృషి చేయడం పట్ల కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.
జీడిమెట్ల డివిజన్ ప్రసూననగర్ సంక్షేమ నూతన కమిటీ సంఘం సభ్యులతోపాటు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ కమిటీతో పాటు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.