KTR | కార్యకర్తల బాగోగులు, ప్రజల సంక్షేమాన్ని బ్యాలెన్స్‌గా నడిపించే బాధ్యత నాది : కేటీఆర్
KTR | మంచి ఐడీ కార్డు తయారుచేసి ప్రతీ కార్యకర్తకు ఇస్తం. మిమ్మల్ని రాబోయే 5 సంవత్సరాలు మాత్రం గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరుగకుండా ఉద్యమకారులను కానీ, కార్యకర్తలను కానీ కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత తీసుకుంటానన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
KTR | ఒక తప్పు మాత్రం చేసినం.. కార్యకర్తల గౌరవం కాపాడలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. చేవెళ్ల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం, ఎస్ఐఆర్ శిక్షణా కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. . చాలా మంది అన్నరు నాతో.. అన్నా పెన్షన్లు, కార్డులు, కల్యాణ లక్ష్మి ఆన్లైన్ అయిపాయే.. రైతు బంధు ఇస్తే అకౌంట్లో పడే. ఇక నా సంగతి ఏంది.. నన్ను ఎవరు పట్టించుకుంటరు.. ఊళ్లే పోయి అడగాలంటే నా గౌరవం ఎక్కడుంటది అని అన్నారు.. అందుకే ఇలాంటి చిన్నచిన్న పొరపాట్లు జరుగకుండా చూసుకుంటమని నేను మీకు మాటిస్తున్నానన్నారు.
వాస్తవానికి మొత్తం ప్రభుత్వం మీద దృష్టి పెట్టినం.. పార్టీ మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు. కొత్త రాష్ట్రం, కొత్త సంసారం కాబట్టి పునాది గట్టిగా పడాలి అని.. మన రాష్ట్రం నవ్వే వాళ్ళ ముందు జారిపడొద్దని.. మీకు పరిపాలన చేతనైతదా అన్నోళ్లను నోళ్లు మూయించాలే.. మంచిగా నడిపించాలని ఆలోచన చేసాం తప్ప వేరే ఆలోచన చేయలేదు. కానీ నేను మీకు మాటిస్తున్నా.. వచ్చే ఐదేళ్లు అట్లుండది.. 2028లో మీ అందరి దయతో కేసీఆర్ ముఖ్యమంత్రి అయితరు.. అయిన తర్వాత నేను బాధ్యత తీసుకుంటా.. వచ్చే ఐదేళ్లు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకర్తల బాగోగులు, ప్రజల సంక్షేమం రెండింటిని బ్యాలెన్స్‌గా నడిపించే బాధ్యత నాదని భరోసానిచ్చారు.
మీకు రావాల్సిన పదవులు.. జరుగాల్సిన లాభం. మీకు కోరుకునే గౌరవం వచ్చే విధంగా చేసే బాధ్యత నాది. గతం మరిచిపోండి.. చిన్నచిన్నపొరపాట్లు జరిగి ఉండొచ్చు. ఇక్కడ ఉద్యమంలో పనిచేసిన బిడ్డలు కూడా ఉన్నారు. వాళ్లకు కూడా అయ్యో మాకు జరుగాల్సిన న్యాయం జరుగలేదనే భావన ఉండొచ్చు. నేను వారందని ప్రార్థిస్తున్నా.
ఒక సైనికుడు శాంతి సమయంలో ఎంత చెమట చిందిస్తే, యుద్దంలో అంత తక్కువ రక్తం కారుతుంది. మీ ఈ టైంలో పార్టీని బందబస్తుగా నిర్మాణం చేసుకుంటే రేపు ఎన్నికలు వచ్చినంక ఆగమాగమయ్యే బాధ తప్పుతది.. మీకు ఐడీ కార్డు వస్తది.. ఆ ఐడీ కార్డు రేపు మన ప్రభుత్వం వచ్చినంక జేబులో పెట్టుకొని పోతే ఆ ఆఫీసర్ అయినా పోలీసోడు అయినా కేసీఆర్ మనిషి వచ్చిండు పని చేయాలని మీకు గౌరవమిచ్చి పనిచేసే పరిస్థితి ఉంటది. మంచి ఐడీ కార్డు తయారుచేసి ప్రతీ కార్యకర్తకు ఇస్తం. మిమ్మల్ని రాబోయే 5 సంవత్సరాలు మాత్రం గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరుగకుండా ఉద్యమకారులను కానీ, కార్యకర్తలను కానీ కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత తీసుకుంటానన్నారు.
కార్యకర్తల గౌరవం కాపాడకుండా తప్పు చేసాము
మొత్తం ప్రభుత్వం మీద దృష్టి పెట్టి, పార్టీ మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు
కొత్త రాష్ట్రం, కొత్త సంసారం కాబట్టి, మన రాష్ట్రం నవ్వే వాళ్ళ ముందు జారిపడొద్దని.. మంచిగా నడిపించాలని ఆలోచన చేసాము
కానీ వచ్చే 5 సంవత్సరాలు అలా ఉండదు.. 2028లో… https://t.co/D0sZY4vZPc pic.twitter.com/k5T1DzfZlv
— Telugu Scribe (@TeluguScribe) June 25, 2026
The More You Sweat In Peace.. The Less You Bleed In War
ఒక సైనికుడు శాంతి సమయంలో ఎంత చెమట చిందిస్తే, యుద్దంలో అంత తక్కువ రక్తం కారుతుంది
కార్యకర్తలు ఈ సమయంలో పార్టీని బందోబస్తుగా సిద్దం చేసుకుంటే, ఎన్నికల సమయంలో గెలుపు అంత సులభంగా అవుద్ది
– కేటీఆర్ https://t.co/G8TuNvF9zC pic.twitter.com/vIy6onYTFg
— Telugu Scribe (@TeluguScribe) June 25, 2026
Read Also :
Strait of Hormuz | హర్మూజ్ దారి క్లియర్.. జలసంధిని దాటిన 30 భారత నౌకలు, క్యూ లైన్లో మరో 26 షిప్స్..!
Bala Krishna | అమరావతిలో ఘనంగా ప్రారంభమైన NBK112.. బాలయ్య-కొరటాల సినిమాకి అంత ఖర్చు చేస్తున్నారా..!
Urine Leak | మూత్రం లీక్ అయ్యే సమస్యకు సిగ్గుపడాల్సిన పనిలేదు.. అనేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి..
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

