HYDRAA | మాదాపూర్, ఫిబ్రవరి 28: సున్నం చెరువులో నివాసాలు ఏర్పరచుకొని జీవనం సాగిస్తున్న వలస కూలీలపై హైడ్రా మరోసారి పిడుగు వేయనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పలువురు అధికారులతో కలిసి సున్నం చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు.
సున్నం చెరువు పరిసర ప్రాంతంలో నివాసాలు ఏర్పరచుకున్న కూలీలతో ఆయన మాట్లాడారు. మార్చ్ 8 వ తేదీ వరకు సున్నం చెరువులో నివాసం ఉంటున్న వారందరూ ఖాళీ చేయాలని సూచించారు. లేదంటే అట్టి పరిసర ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరచుకొని ఉన్న గుడిసెలు, పలు నిర్మాణాలను కూల్చి వేయడం జరుగుతుందని హెచ్చరించారు. అనంతరం సున్నం చెరువును పుడికతీత తీసేందుకు అందులోని నీటిని తొలగించేందుకు బ్రిడ్జి కింది భాగాన్ని కూల్చి నీళ్ళు పోయేలా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో హైడ్రా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.