Hydraa | బుల్కాపూర్ నాలాకు హైడ్రా గేట్లు.. గండిపేటకు తప్పిన మురుగు ముప్పు
Hydraa | జంటనగరాలకు తాగు నీరు అందించే గండిపేట(ఉస్మాన్‌సాగర్)కు మురుగు ముప్పు తప్పింది. ఖానాపూర్, వట్టి నాగులపల్లి నుంచి వచ్చిన మురుగు నీరు బుల్కాపూర్ నాలా ద్వారా గండిపేటలోకి వెళ్లకుండా హైడ్రా చర్యలు తీసుకుంది. రూ. 2 లక్షలు వెచ్చించి బుల్కాపూర్ నాలాకు కొత్త షట్టర్లను ఏర్పాటు చేసింది
Hydraa | మణికొండ, మే 15: జంటనగరాలకు తాగు నీరు అందించే గండిపేట(ఉస్మాన్‌సాగర్)కు మురుగు ముప్పు తప్పింది. ఖానాపూర్, వట్టి నాగులపల్లి నుంచి వచ్చిన మురుగు నీరు బుల్కాపూర్ నాలా ద్వారా గండిపేటలోకి వెళ్లకుండా హైడ్రా చర్యలు తీసుకుంది. రూ. 2 లక్షలు వెచ్చించి బుల్కాపూర్ నాలాకు కొత్త షట్టర్లను ఏర్పాటు చేసింది. వరద వచ్చేటప్పుడు గండిపేటకు చేరేలా కాలువకు ఉన్న షట్టర్లు (గేట్లు) శిథిలమైన విషయం విదితమే. మురుగు నీరు గండిపేటలో కలుస్తున్నదని ఇటీవల నమస్తే తెలంగాణలో వచ్చిన కథనాలపై హైడ్రా స్పందించింది. అధికారుల బృందంతో కలిసి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వెంటనే షట్టర్ల మరమ్మతులను చేపట్టాలని అధికారులను హైడ్రా కమిషనర్ ఆదేశించారు.
శిథిలమైన షట్టర్ల స్థానంలో కొత్తవి అమర్చడంతో మురుగు నీరు గండిపేట చెరువులోకి వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. అలాగే బుల్కాపూర్ నాలాలో పూడికపోయిన చెత్తను కూడా కొంతమేర తొలగించి మురుగు నీరు ముందుకు సాగేలా ఏర్పాట్లు చేశారు. ఒకప్పుడు వరద కాలువగా ఉన్న బుల్కాపూర్ నాలాలో పైన ఉన్న నివాసాలు, వాణిజ్య సముదాయాలు , రిసార్టుల నుంచి మురుగు నీరు ప్రవహిస్తోంది. శంకరపల్లిలోని బుల్కాపూర్ చెరువు నుంచి ఖానాపూర్, కోకాపేట, నార్సింగి, పుప్పాలగూడ, మణికొండ, దర్గా, షేక్‌పేట, టోలిచౌకి , పోచమ్మ బస్తీ, చింతలబస్తీ మీదుగా హుస్సేన్ సాగర్‌కు వర్షపు నీరును తీసుకెళ్లే చరిత్ర ఈ నాలాది. బుల్కాపూర్ నాలాను పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయని.. హుస్సేన్ సాగర్‌కు వర్షపు నీటిని తీసుకొచ్చే ఏకైక నాలాగా దీనికి ప్రత్యేక స్థానం ఉందని స్థానికులు గుర్తు చేశారు. ఇప్పుడీ నాలా పునరుద్ధరణపై హైడ్రా దృష్టి పెట్టింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

