HYDRA | సిటీబ్యూరో, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ ) : జనావాసాల మధ్య ప్రమాదకర రసాయాలను అక్రమంగా నిల్వ చేస్తే.. కఠిన చర్యలు తప్పవని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. బోయిగూడ స్క్రాప్గోడౌన్, సికింద్రాబాద్ రూబీ హోటల్, సికింద్రాబాద్ దక్కన్ కార్పొరేట్ నిట్వేర్, సికింద్రాబాద్ స్వప్న లోక్కాంప్లెక్స్, నాంపల్లి బాలాజీ రెసిడెన్షియల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మొత్తం 53 మంది వరకు చనిపోయారని గుర్తు చేశారు.
ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న నివాస భవనాల మధ్యలో ప్రమాదకర వస్తువులు అనధికార, అక్రమ నిల్వ కార్యకలాపాలు జరుగుతున్నట్లు తమ దృష్టి వచ్చిందని, కచ్చితంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టి చర్యలు చేపడతామన్నారు.
ఎక్కడైనా అక్రమ రసాయన నిల్వలుంటే.. 18005990099 లేదా 040-2956 0509 టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. కమిషనర్‌కు వ్యక్తిగతంగా కలుసుకుని ఫిర్యాదు చేయాలనుకునే వారు ముందుగా అపాయింట్మెంట్ 72079 23085 నంబర్‌కు మెసేజ్ చేస్తే చాలన్నారు.