HYDRA | బేగంపేటలో నాలాపై ఆక్రమణలు.. హైడ్రా కూల్చివేతలు
సికింద్రాబాద్ బేగంపేట- ప్యాట్నీ పరిధి ఆక్రమణలపై హైడ్రా (HYDRA) అధికారులు కొరఢా ఝులిపిస్తున్నారు. పాట్నీ నాలా పరివాహక ప్రాంతంలో ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. కంటోన్మెంట్ యంత్రాంగంతో కలిసి నాలాపై నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగిస్తున్నారు.
బేగంపేట: సికింద్రాబాద్ బేగంపేట- ప్యాట్నీ పరిధి ఆక్రమణలపై హైడ్రా (HYDRA) అధికారులు కొరఢా ఝులిపిస్తున్నారు. పాట్నీ నాలా పరివాహక ప్రాంతంలో ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. కంటోన్మెంట్ యంత్రాంగంతో కలిసి నాలాపై నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగిస్తున్నారు. నాలాను ఆనుకొని ఉన్న రెండు భవనాలను కూల్చివేస్తున్నారు. గురువారం కంటోన్మెంట్ సీఈవో మధుకర్ నాయక్‌తో కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్యాట్నీ నాలాను పరిశీలించారు. ఈ సందర్భంగా నాలాను ఆక్రమించినవారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

దీంతో శుక్రవారం ఉదయాన్నే బుల్డోజర్లతో అక్కడి చేరుకున్న హైడ్రా సిబ్బంది ఆక్రమణలను కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలతో ప్యాట్నీ నాలా కుచించుకుపోవడంతో వరదలు వచ్చినప్పుడు కాలనీలు, ఇండ్లలోకి నీరు ప్రవేశిస్తున్నదని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కూల్చివేతలు చేపడ్డారు.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

