Beer Companies | బీర్ల కంపెనీలకు నీళ్లు.. రైతులకు కన్నీళ్లా..! 12 లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు
పంటలకు నీరందించాలని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటుంటే.. పట్టించుకోని రేవంత్ సర్కార్ బీర్ల కంపెనీల కు నీళ్లివ్వడం దుర్మార్గమని ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎ ర్రోళ్ల శ్రీనివాస్ ధ్వజమెత్తారు.
- 12 లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు
- రేవంత్ తుగ్లక్ చర్యలతో రైతులకు నష్టం
- ప్రశ్నించిన ప్రతిపక్షంపై ఎదురుదాడి సిగ్గుచేటు
- ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్
- సర్కార్ పాపం.. సింగూరుకు శాపం
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): పంటలకు నీరందించాలని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటుంటే.. పట్టించుకోని రేవంత్ సర్కార్ బీర్ల కంపెనీల కు నీళ్లివ్వడం దుర్మార్గమని ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎ ర్రోళ్ల శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో సింగూరు ప్రాజెక్టు కింద 12లక్షల ఎకరా ల్లో పంటలు ఎండిపోయాయని ఆందోళన వ్యక్తంచేశారు. రేవంత్ తుగ్లక్ చర్యలతో నిండుగా ఉన్న సింగూ రును ఖాళీ చేసి ఏడారిగా మార్చారని మండిపడ్డారు.
బుధవారం తెలంగాణ భవన్లో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ప్రవీణ్‌కుమార్, గోసుల శ్రీనివాస్, పార్టీ నేతలు అభిలాష్ రంగినేని, గౌతంప్రసాద్తో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కరువు ముప్పును ఎదుర్కోవాల్సిన ప్రభుత్వం.. సమస్యలపై ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలపై ఎదురుదాడికి దిగుతూ కాలక్షేపం చేస్తున్నదని దుయ్యబట్టారు.
ఆంధ్రాలో జలసిరులతో చంద్రబాబు పంటలు పండించుకుంటుంటే.. ఇక్కడ రేవంత్‌రెడ్డి క్రాప్‌హాలిడే ప్రకటించి గురుదక్షిణ చెల్లించుకున్నారని ఆరోపించారు. ఎంపీ చామల, ఎమ్మెల్సీలు బల్మూరి, అద్దంకి దయాకర్ చిల్లర మాటలు మాట్లాడటం కాదని, దమ్ముంటే ఎండిన పంటపొలాల వద్దకు వెళ్లి రైతులను పరామర్శించాలని సవాల్ విసిరారు. ‘సీఎంవో రాసిచ్చే స్రిప్టులు చదవడానికి మీరు ప్రజాప్రతినిధులా? లేక రేవంత్ ప్రైవేట్ భజనపరులా? అని నిలదీశారు. బ్లాక్ మారెట్ను అరికట్టలేక బియ్యం ధరను కిలో రూ.90కి, నూనె రూ.220కు పెరిగాయని ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | మా ముందుకొచ్చి మాట్లాడే దమ్ముందా?.. కాంగ్రెస్ నేతలకు రైతు సవాల్
Malasiya | భారతీయులకు మలేషియా షాక్.. వీసా ఫ్రీ ఎంట్రీ నిలిపివేత
Aadhar Card | ‘పుట్టిన తేదీకి ఆధార్ కార్డ్ ధ్రువపత్రం కాదు’
PF Withdraw | ఇకపై నెలనెలా పీఎఫ్ విత్‌డ్రా.. సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌కు ఈపీఎఫ్‌వో ఆమోదం
Shah Rukh Khan | షారుఖ్ఖాన్అరుదైన ఘనత.. ది 100 గ్రేటెస్ట్ మూవీ స్టార్స్ ఆఫ్ ఆల్‌టైమ్ జాబితాలో చోటు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

