ఎన్హెచ్ఎం ఉద్యోగులకు అండగా ఉంటాం
మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి.. ఉద్యోగుల సమ్మెకు సంపూర్ణ సంఘీభావం.. 4 లక్షల మందిని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి.
- మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్
మహబూబ్‌నగర్/మహదేవపూర్(భూపాలపల్లి), అక్టోబర్ 28 : ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి అండగా ఉంటామని, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ, శాసన మండలిలో ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం భూపాలపల్లి జిల్లాకేంద్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం 16వ రోజుకు చేరింది.

సిరికొండ మధుసూదనాచారి ఉద్యోగుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించి మాట్లాడారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం ఎంతదూరమైనా ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు.మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపం వద్ద జాతీయ హెల్త్ మిషన్ ఉద్యోగులు తమ సమస్యల సాధన కోసం చేపట్టిన దీక్షకు మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి సంఘీభావం తెఎలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్ని రాష్ర్టాల్లో ఎన్హెచ్ఎం ఉద్యోగులను రెగ్యులర్ చేశారని, తెలంగాణలో కూడా చేయాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

