జగద్గిరిగుట్ట ఫిబ్రవరి 20: పరికిచెరువు పరిధి లోని పలు ఆక్రమణలను హైడ్రా ఆధ్వర్యంలో గురువారం కూల్చివేశారు. భూదేవి హిల్స్ , మహదేవపురం , కూకట్ పల్లి పరిధిలోని భూముల్లోని 10 బేస్మెంట్లు, ఒక స్లాబ్ నిర్మాణాన్ని కూల్చివేశారు. జగద్గిరిగుట్ట రాజీవ్‌గృహకల్ప ఆల్విన్ కాలనీ మధ్య ఉన్న ప్రాంతంలో నిర్మాణాలపై చాలాకాలంగా వివాదాలున్నాయి.
60 ఎకరాలకు పైగా ఉన్న చెరువును 15 ఎకరాలకు కుంచించుకు పోయింది. ఈ నేపథ్యంలో గురువారం జగద్గిరిగుట్ట పోలీసులు రెవెన్యూ టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. హైడ్రా తొలగింపులు సాగుతుండగా రవి అనే వ్యక్తి తన బేస్మెంట్ కూల్చివేశారని యంత్రం వద్ద ఆందోళనకు దిగాడు.
భూదేవి హిల్స్ విక్రయదారుడు బాలకృష్ణ ఏడాది కిందట తనకు రూ. 15 లక్షలకు ప్లాట్ విక్రయించాడని వాపోయాడు. జేసీబీకి అడ్డు పడి తన అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు అతన్ని పక్కకు తీసుకెళ్లి కూల్చివేత పనులు కొనసాగించారు.