పటాన్చెరు, జనవరి 31(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగిలో గాయత్రి కాలనీలో పార్క్ స్థలంలో అక్రమంగా నిర్మించారంటూ షెడ్డును హైడ్రా సిబ్బంది శుక్రవారం కూల్చేశారు. సర్వేనంబర్ 296లో ఏడుగుంటల పార్క్ స్థలంలో షెడ్డు నిర్మించారంటూ స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన హైడ్రా.. అక్కడ అక్రమ నిర్మాణం జరిగిందంటూ తేల్చి షెడ్డును జేసీబీలతో తొలగించింది.
సిటీబ్యూరో, జనవరి 31 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో అప్పుడే ఎండలు షురువయ్యాయి. శుక్రవారం గరిష్ఠం 33.4, కనిష్ఠం 17.6డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 43శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.