హైదరాబాద్: హైదరాబాద్లోని గచ్చిబౌలిలో హైడ్రా (HYDRA) కూల్చివేతలు చేపట్టింది. సంధ్య కన్వెన్షన్ సమీపంలో నిర్మాణాలను హైడ్రా సిబ్బంది తొలగించారు. ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టినట్లు స్థానికుల నుంచి హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. దీంతో సోమవారం ఉదయం అధికారులు చర్యలు చేపట్టారు. అనుమతులు లేని షెడ్లు, నిర్మాణాలను భారీ క్రేన్లతో నేలమట్టం చేశారు. భారీ పోలీస్ బందోబస్త్ మధ్య కూల్చివేతలు నిర్వహించారు. గతంలో కూడా ఇక్కడ అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే.
