హైదరాబాద్: మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలో హైడ్రా అధికారులు బుల్డోజర్లకు పనిచెప్పారు. కొర్రెముల రెవెన్యూ పరిధిలోని ఏకశిలా నగర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఓ వెంచర్లో ఉన్న ప్లాట్లకు అడ్డుగా రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రహరీ గోడ నిర్మించారు. దీంతో స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో సర్వే నిర్వహించిన అధికారులు అది అక్రమ నిర్మాణామని గుర్తించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం కూల్చివేతలు చేపట్టారు. ఈ సందర్భంగా భారీగా పోలీసులు, హైడ్రా సిబ్బంది మోహరించారు.