సిటీబ్యూరో, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ప్రజలకు వర్షానికి సంబంధించి ముందస్తుగా కచ్చితమైన సమాచారం ఇచ్చేందుకు హైడ్రా ప్రయత్నిస్తున్నదని, ఆ దిశగా వివిధ విభాగాలతో కలిపి సమన్వయం కోసం ఒక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయనున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. శనివారం బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో పట్టణ ప్రాంతాల్లో వాతావరణ అంచనా, పర్యవేక్షణ అనే అంశంపై సదస్సు జరిగింది.
వర్షానికి సంబంధించి ముందస్తు సమాచారం ఇవ్వడంతో పాటు ఎప్పుడు వర్షం పడుతుందనే కచ్చితమైన సమాచారం ప్రజలకు చేరవేయాలని కమిషనర్ రంగనాథ్ చెప్పారు. హైడ్రా, వాతావరణశాఖ, తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్, స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ, ఐఐటీ హైదరాబాద్‌తో కలిసి ఒక వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. ఈ విభాగాలన్నీ సమన్వయంతో పనిచేసి వర్షాన్ని అంచనా వేయడంతో పాటు గాలుల తీవ్రతను కూడా అంచనా వేయాల్నరు.