సిటీ బ్యూరో, జూన్ 5 (నమస్తే తెలంగాణ): తార్నాక కూడలిలోని సిగ్నల్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిడ్ తెలిపారు. గురువారం తార్నాక జంక్షన్‌ను ఆయన పరిశీలించారు. వాహనదారుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా సిగ్నల్‌ను మూసేస్తున్నట్లు స్పష్టం చేశారు. వాహనదారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ తెలిపారు.