Hyderabad Rains | హైదరాదరాబాద్లో సోమవారం మధ్యాహ్నం పలుచోట్ల వర్షం కురిసింది. ఖైరతాబాద్ లక్డీకాపూర్, పంజాగుట్ట, చిలకలగూడ, మారేడ్‌పల్లి, బోయినపల్లి, తిరుమలగిరి, బేగంపేట, ప్యాట్నీ, బోరబండ, అల్లాపూర్, మోతీనగర్, ఎర్రగడ్డ ప్రాంతాల్లో వర్షం కురిసింది. సనత్‌నగర్, ఎస్సార్‌నగర్, అమీర్‌పేట, మధురానగర్, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, రామంతాపూర్, షైక్‌పేట, మణికొండతో పాటు పలు ప్రాంతాల్లో వాన కురిసింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. రాబోయే గంట సేపట్లో హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది.