Women Safety | సిటీబ్యూరో, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాలలో మహిళలు, యువతుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే పోకిరీలపై నిఘా కొనసాగుతుందని, వారి అసభ్య ప్రవర్తనను రికార్డు చేసి అరెస్ట్ చేస్తున్నామని హైదరాబాద్ మహిళా సేఫ్టీ డీసీపీ కవిత తెలిపారు.
ఇటీవల అరెస్ట్ చేసిన 12 మందికి కోర్టు జరిమానా విధించిందన్నారు. షీ టీమ్ నిరంతరం మహిళా రక్షణ కోసం పని చేస్తుందని, ఇబ్బందులుంటే వెంటనే షీ టీమ్స్‌ను ఆశ్రయించాలని ఆమె సూచించారు.